Ashok Gajapathi Raju: జగన్ హయాంలో నాపై క్రిమినల్ కేసు.. అశోక్ గజపతిరాజు ఫైర్
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:01 PM
వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను ధ్వంసం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు. వంశపారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
విజయనగరం , అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వం (Jagan Govt)పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వానిది విధ్వంస పాలన అని విమర్శించారు. ఇవాళ(శనివారం) పైడితల్లి అమ్మవారి పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు అశోక్ గజపతిరాజు.
వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను ధ్వంసం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆక్షేపించారు. వంశపారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని తాను ప్రశ్నిస్తే తనపై జగన్ హయాంలో అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. అప్పటి మంత్రుల అడుగులకు మడుగులు ఒత్తుతూ ఈవోలు పనిచేశారని విమర్శించారు. మాన్సాస్ సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రశ్నస్తే తనపై క్రిమినల్ కేసు పెట్టారని అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News