Heavy Rains in AP: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 03:03 PM
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
విశాఖపట్నం, అక్టోబర్ 3 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు (Heavy Rains) పడే కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. గడచిన 24 గంటల్లో 15 ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదైందని వివరించారు. పలాస, మందసలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. టెక్కలి, గరివిడి, పాతపట్నంలో 9.. కురుపాం, కలింగపట్నం, సోంపేట, చీపురుపల్లి, నెల్లిమర్ల, పాలకొండలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో నిన్న(గురువారం) అత్యధికంగా 66 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై అరుదైన రికార్డ్
మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ
Read Latest AP News And Telugu News