Narayana: అశోక్ గజపతిరాజు ఆ విషయంలో ఆదర్శంగా నిలిచారు.. నారాయణ ప్రశంసలు
ABN , Publish Date - Dec 21 , 2025 | 08:53 PM
గోవా గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజుకు సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అభినందనలు తెలిపారు. అశోక గజపతిరాజు రాజకీయాల్లో ఉంటూ కూడా ఆదాయాన్ని సమకూర్చుకోకపోగా, తనకున్న సొంత ఆస్తి నుంచి రూ.1000 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారని ప్రశంసించారు.
అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజుకు (Ashoka Gajapathiraju) సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ (CPI Leader Narayana) అభినందనలు తెలిపారు. అశోక గజపతిరాజు రాజకీయాల్లో ఉంటూ కూడా ఆదాయాన్ని సమకూర్చుకోకపోగా, తనకున్న సొంత ఆస్తి నుంచి రూ.1000 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారని ప్రశంసించారు. ఆ భూమిలో ఏవియేషన్‌కి సంబంధించినవి ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి సూచించారని వివరించారు.
ఈతరం రాజకీయాల్లో రూపాయి పెట్టుబడి పెట్టి రూ.100 కోట్లు సంపాదించే పరిస్థితి ఉందని.. కానీ అశోక గజపతిరాజు రూ.1000 కోట్ల విలువైన తన సొంత భూమిని ఇవ్వటం ద్వారా రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. నేడు సమాజంలో విలువలు దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతి పరాకాష్టకు చేరిందని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులు ఆయన సేవలను చూసి సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఈ విషయంలో సమాజం అశోక గజపతి రాజును తప్పనిసరిగా అభినందించాలని నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ బర్త్‌డే వేడుక.. వైసీపీలో బయటపడ్డ కుమ్ములాటలు..!
అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి
Read Latest AP News And Telugu News