Share News

Kakani Govardhan Reddy: అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి

ABN , Publish Date - Dec 21 , 2025 | 04:03 PM

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం.

Kakani Govardhan Reddy: అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి
Kakani Govardhan Reddy

నెల్లూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ (YSRCP) కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఇరిగేషన్ విభాగంలోని ఇన్‌చార్జి ఎస్ఈ దేశీనాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డిలు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈక్రమంలో ఇరిగేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


పదవీ విరమణ పొందినా, లెక్కలన్నీ సరి చేయిస్తానని... ఆస్తులు మొత్తం అమ్మించి కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని ఇటీవల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బయటపెట్టిన విషయం తెలిసిందే. మీడియాని వెంట పెట్టుకుని వెళ్లి.. కాకాణి పనులు చేయకుండానే రూ.కోట్లలో బిల్లులు చేసుకున్న ప్రాంతాలను సోమిరెడ్డి చూపారు.


ఇరిగేషన్‌లో ఆధారాలు బయటపెట్టి రూ.150కోట్లకు పైగా అవినీతి చేశారని సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. విజిలెన్స్ విచారణలోనూ నాటి అక్రమాలు బట్టబయలు అయ్యాయి. అయితే, సోమిరెడ్డి ఆరోపణలపై ఇప్పటికీ కాకాణి సమాధానం ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులపై ఎదురుదాడికి దిగడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ బర్త్‌డే వేడుక.. వైసీపీలో బయటపడ్డ కుమ్ములాటలు..!

గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 21 , 2025 | 04:13 PM