Mallikarjun Kharge: ఖర్గేకు అస్వస్థత.. గుండెకు పేస్‌మేకర్..!
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:40 PM
ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీలో పాల్గొన్నారు. మంగళవారం నాడు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, ఉత్తర కర్ణాటకలో భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
బెంగళూరు: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (83) బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో బుధవారం నాడు చేరారు. ఆయన గుండెకు పేస్‌మేకర్ అమర్చాలని వైద్యులు సూచించారని ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో తెలిపారు.
'ఖర్గేకు జ్వరం, కాలు నొప్పి కారణంగా మంగళవారం నాడు ఆసుపత్రిలో చేర్చాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆందోళన పడాల్సిన పని లేదు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు' అని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీలో పాల్గొన్నారు. మంగళవారం బెంగళూరులో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, ఉత్తర కర్ణాటకలో భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర సాయానికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఖర్గేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరామర్శించారు. గురువారం నాడు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..
స్వదేశీ స్టెల్త్ ఫైటర్స్.. ప్రోటోటైప్ కోసం ఏడు సంస్థలు పోటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి