Share News

Central Govt: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:32 PM

దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Central Govt: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..

దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ ఆమోదం తర్వాత సవరించిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈసారి పెంచబోయే డీఏలో మూడు శాతం పెరుగుదల ఉండొచ్చని తెలుస్తోంది.


కేంద్ర ప్రభుత్వం డీఏ (Dearness Allowance) పెంచితే.. ఈ ఏడాది ఇది రెండోసారి అవుతుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెంచుతుంది. జనవరి, జూలైలో నెలల్లో పెంచుతూ వచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది మాత్రం మార్చిలో ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంపుతో డీఏ అలవెన్స్‌ రేటు 53 నుంచి 55 శాతానికి పెరిగింది.


అయితే ఇప్పుడు ఎంతమేర డీఏ పెంచునున్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేకున్నా.. ఆ శాఖ వర్గాల సమాచారం మేరకు 3 శాతం ఉండొచ్చని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచారు. కాగా, తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇదిలా ఉండగా.. కేంద్రం డీఏను పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ

26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 01 , 2025 | 03:52 PM