Bihar SIR: బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:27 PM
బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఈసీ చేపట్టడం విశేషం. ఓటర్ల తుది జాబితా ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది. తుది జాబితా కాపీలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపిస్తామని బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలిపారు.
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను చేపట్టిన ఎన్నికల కమిషన్ (Election Commisssion) మంగళవారంనాడు మధ్యాహ్నం 3.00 గంటలకు ఓటర్ల తుది జాబితాను (final voter list) విడుదల చేసింది. సవరించిన ఓటర్ల జాతాను ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఈసీ చేపట్టడం విశేషం. ఓటర్ల తుది జాబితా ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది. తుది జాబితా కాపీలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపిస్తామని బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలిపారు. వీరితో పాటు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు కూడా ఈ జాబితాను షేర్ చేస్తామని చెప్పారు.
ఎస్ఐఆర్ వివాదం
బీహార్‌లో ఈసీ ఇటీవల చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చుట్టూ వివాదం తలెత్తింది. బీజేపీకి అనుకూలంగా ఓటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ టాంపరింగ్ చేస్తోందని విపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ విజ్ఞప్తులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ, తుది జాబితా ప్రచురించిన తర్వాత ఏవైనా అవకతవకలు జరిగినట్టు తేలితే మొత్తం ప్రక్రియనే ఆపేస్తామని హెచ్చరించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
బిహార్‌లో ఈసీ టీమ్ పర్యటన
కాగా, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ టీమ్ ఈనెల 4,5 తేదీల్లో బిహార్‌లో పర్యటించనుంది. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఛాత్ పండుగ పూర్తయిన తర్వాత అక్టోబర్‌లో తొలి విడత ఎన్నిక జరగవచ్చని అంచనా వేస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికలను పర్యవేక్షించేందుకు 470 మంది పరిశీలకులను ఈసీ ఇప్పటికే నియమించింది. 243 మంది సభ్యుల ప్రస్తుత బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది.
ఇవి కూడా చదవండి..
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి