Share News

Wine Shops Closed: మందుబాబులకు షాక్.. పండగ రోజే మద్యం దుకాణాలు బంద్..

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:26 PM

హైదరాబాద్ నగరవ్యాప్తంగా గురువారం నాడు మద్యం, మాంసం దుకాణాలు బంద్ కావడంతో.. సిటీలోని వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. నగరంలో ఎక్కడ చూసినా మాంసం, మద్యం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.

Wine Shops Closed: మందుబాబులకు షాక్.. పండగ రోజే మద్యం దుకాణాలు బంద్..
Dry Day

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో దసరా పండుగ శోభ సంతరించుకుంది. పండగ నిర్వహించుకునేందుకు నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. అయితే ఈ ఏడాది దసరా పండుగలో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. గాంధీ జయంతి రోజే (అక్టోబర్ 2న) దసరా పండగ వచ్చింది. అయితే, ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారు. గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం మూసివేస్తుంది. దీంతో పండగ వేళ మద్యం ప్రియులకు షాక్ తగిలినట్లు అయ్యింది. అయితే, రేపటి కోసం కొంతమంది ఇప్పటి నుంచే షాపుల ముందు బారులు తీరుతున్నారు.


రేపు(గురువారం) హైదరాబాద్ నగరవ్యాప్తంగా మద్యం, మాంసం దుకాణాలు బంద్ కావడంతో.. సిటీలోని వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. నగరంలో ఎక్కడ చూసినా మాంసం, మద్యం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. గాంధీ జయంతి ఎఫెక్ట్‌తో.. నిన్న(మంగళవారం) ఒక్కరోజే రూ.270 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ఇవాళ(బుధవారం) రూ.300 కోట్ల సేల్స్ పెరగవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం వ్యాపారులు భారీ స్టాక్‌‌తో సేల్స్‌కు రెడీ అయ్యారు. దీంతో వైన్ షాపులు, లిక్కర్ మార్టుల వద్ద మందుబాబుల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల ముందు క్యూలైన్లలో మందు బాబులు హల్ చల్ చేస్తున్నారు. ఎంతో ఓపిగ్గా గంటల తరబడి మరీ నిలబడి మందు కోసం వెయిట్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ

26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి

Updated Date - Oct 01 , 2025 | 05:50 PM