Share News

Hari Singh Nalwa: దసరా ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు హరిసింగ్ నల్వా

ABN , Publish Date - Oct 01 , 2025 | 07:54 AM

విజయదశమి లేదా దసరా పండుగ హిందూ, సిక్కు ప్రజనీకానికి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పవిత్ర దినాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు.. సిక్కు సామ్రాజ్యానికి కమాండర్ హరిసింగ్ నల్వా..

Hari Singh Nalwa: దసరా ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు హరిసింగ్ నల్వా
Hari Singh Nalwa

ఇంటర్నెట్ డెస్క్: విజయదశమి లేదా దసరా పండుగ హిందూ, సిక్కు ప్రజనీకానికి అత్యంత ముఖ్యమైన పండుగ. అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది. ఈ పవిత్ర దినాన్ని ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు.. సిక్కు సామ్రాజ్యానికి కమాండర్ అయిన హరిసింగ్ నల్వా. మహారాజా రంజీత్ సింగ్ పాలనలో ఖైబర్ పాస్ వరకు సిక్కు సామ్రాజ్యాన్ని విస్తరించిన ఈ యోధుడు, 1836లో దసరా ఉత్సవాల తర్వాత జమ్రుద్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయం అఫ్ఘాన్ ఆక్రమణదారులకు భారత రాజుల పట్ల శాశ్వత భయాన్ని నింపిందంటే, హరిసింగ్ ఏ మేరకు ప్రభావం చూపాడో అర్థం చేసుకోవచ్చు.

dasara


హరిసింగ్ నల్వా 1791లో పంజాబ్‌లోని గుజరంవాలాలో జన్మించాడు. 'నల్వా' అనే పేరు అతనికి పులిని చంపిన ధైర్యసాహసాలకుగాను వచ్చింది. అనంతరం మహారాజా రంజీత్ సింగ్ సైన్యంలో చేరిన తర్వాత, కసూర్, సియాల్‌కోట్, అటాక్, ముల్తాన్, కశ్మీర్, పేషావర్ వంటి ప్రాంతాల్లో అనేక యుద్ధాల్లో హరిసింగ్ విజయం సాధించాడు. అఫ్ఘాన్ తల్లులు తమ పిల్లలను భయపెట్టడానికి 'హరి సింగ్ వస్తాడు' అని చెప్పేవారట. అంటే, ఆఫ్ఘాన్లలో హరిసింగ్ ఒక పెద్ద పులి.


దసరా సందర్భంగా అమృతసర్‌లో జరిగిన ఉత్సవాల తర్వాత, హరిసింగ్ తన సైన్యంతో ఖైబర్ పాస్ లోని కీలక ప్రాంతమైన జమ్రుద్ గ్రామంపై అకస్మాత్తుగా దాడి చేశాడు. మిషా ఖైబరీలు, గులీలలో ప్రసిద్ధి చెందిన ఈ గిరిజనులను ఓడించి, కోటను ఆక్రమించాడు. ఈ విజయం సిక్కు సామ్రాజ్యాన్ని ఇండస్ నది దాటి కాబూల్ వరకు విస్తరించేలా చేసింది. దసరా రాముడి విజయాన్ని స్మరించుకునే రోజున, హరిసింగ్ దాన్ని యుద్ధవిజయంగా మలిచాడు.


హరిసింగ్ విజయగాధలు ఈ రోజుకి కూడా యువతకు ధైర్యం, ధర్మరక్షణకు ప్రేరణగా నిలుస్తున్నాయి. హరిసింగ్ నల్వా జీవితం, దసరా విజయాలు.. సిక్కు చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయం. అతని వీరత్వం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ సుస్థిరంగా ఉంది. 1837లో హరిసింగ్ వీరమరణం చెందారు.


ఇవి కూడా చదవండి..

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం

Updated Date - Oct 01 , 2025 | 07:57 AM