DJ Sounds: ప్రాణాలు హరిస్తున్న డీజే సౌండ్‌లు
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:30 AM
పండుగలు, పెళ్లిళ్ల వేళ కర్ణకఠోరంగా మారిన డీజే పాటల శబ్ధాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా పలు మరణాలు సంభవిస్తున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఇవ్వకపోయనా వాటిని జనం పట్టించుకోకుండా..
ఇంటర్నెట్ డెస్క్: శృతిమించుతున్న డీజే సౌండ్‌లు ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల వేళ కర్ణకఠోరంగా మారిన పాటల శబ్ధాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా పలు మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికి తోడు పోలీసులు డీజేలకు రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఇవ్వకపోయనా వాటిని జనం పట్టించుకోకుండా అర్ధరాత్రి వరకు డీజేల మోత మ్రోగిస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ధ్వని తరంగాలు 70 నుంచి 85 డెసిబెల్స్ వరకు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నివేదికలు చెబుతున్నాయి. అయితే, డీజే పాటలు 90 నుంచి 120 డెసిబెల్స్ వరకు పెడుతున్నారు. దీనివల్ల ధ్వనికాలుష్యం ఏర్పడి గుండెపోటు, బ్రేన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కలుగుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో పలు చోట్ల ఇటీవలి కాలంలో మరణాలు సంభవించాయి.
అధిక శబ్ద కాలుష్యంతో గుండెకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్లు అధిక శబ్దాలకు దూరంగా ఉండాలి. అటు, పోలీసులు సైతం డీజే నిర్వాహకులకు అవగాహన కల్పిస్తూ కట్టడి చేయాలి. డీజే మోతలకంటే, గుండె ఆరోగ్యాన్ని అందరూ గుర్తించాలి.
Also Read:
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
For More latest News