Asia Cup trophy: ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
ABN , Publish Date - Sep 29 , 2025 | 07:06 AM
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అసమాన పోరాటంతో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి విజయ కేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో భారత్ చేతిలో వరుసగా మూడు సార్లు పాకిస్థాన్ ఓడిపోయింది.
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది (India vs Pakistan). తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అసమాన పోరాటంతో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి విజయ కేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో భారత్ చేతిలో వరుసగా మూడు సార్లు పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే మ్యాచ్ ఫలితం అనంతరం మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ మొహ్సీన్ నఖ్వీ వ్యవహరించిన తీరు విమర్శలపాలవుతోంది (PCB chief Mohsin Naqvi).
ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్ అయిన నఖ్వీ చేతుల మీదుగా విజేత అయిన టీమిండియా ట్రోఫీ తీసుకోవాలి. అయితే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో నఖ్వీ పాకిస్థాన్ క్రికెటర్లకు మెడల్స్ అందించారు. నఖ్వీకి బదులుగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ వైస్ చైర్మన్ అయిన ఖలీద్ అల్ జరూరీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటామని టీమిండియా చెప్పింది. అయితే అందుకు నఖ్వీ నిరాకరించారు. తానే టీమిండియా ఆటగాళ్లకు మెడల్స్, ట్రోఫీ ఇవ్వాలనుకున్నారు (cricket controversy).
టీమిండియా అందుకు నిరాకరించడంతో మైదానం నుంచి నఖ్వీ వెళ్లిపోయారు (Asia Cup news). వెళ్లిపోతూ తనతో పాటు ఆసియా కప్ ట్రోఫీని, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పతకాలను కూడా పట్టుకెళ్లిపోయారు. అయితే నఖ్వీకి అలా చేసే అధికారం లేదని, అతడి తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా విమర్శించారు. నవంబర్‌లో దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ కాన్ఫరెన్స్‌లో ఈ విషయంపై నిరసన తెలియజేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి