IND vs PAK final: ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ABN , Publish Date - Sep 28 , 2025 | 10:12 AM
ఆసియా కప్‌లో అసలు సిసలు రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కసారి కూడా కూడా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడలేదు. గత 40 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత్, పాక్ జట్లు కలిసి ఫైనల్‌కు చేరుకోలేదు.
ఆసియా కప్‌లో అసలు సిసలు రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కసారి కూడా కూడా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడలేదు. గత 40 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత్, పాక్ జట్లు కలిసి ఫైనల్‌కు చేరుకోలేదు (Asia Cup 2025 Final). ఎట్టకేలకు ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది (India vs Pakistan).
తాజా టోర్నీలో ఇప్పటికే భారత్, పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఆ రెండింట్లోనూ టీమిండియానే గెలిచింది. ఈ రోజు మూడో సారి ఈ రెండు జట్లు బరిలోకి దిగబోతున్నాయి (IND vs PAK final). ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే మరే జట్టూ సాధించలేని హ్యాట్రిక్ విజయాలను టీమిండియా సాధించగలదు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ జట్లు ఆడిన టోర్నమెంట్లలో, రెండు జట్లు ఒకదానితో ఒకటి మూడుసార్లు తలపడిన సందర్భాలు గతంలో రెండే ఉన్నాయి. అయితే ఆ మూడు సందర్భాల్లోనూ ఒకే జట్టు విజయం సాధించడం మాత్రం ఇప్పటివరకు లేదు. ఈ రోజు టీమిండియాకు ఆ రికార్డు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి (India hat-trick win).
1983 ప్రపంచ కప్‌లో భారత్, వెస్టిండీస్ మూడుసార్లు తలపడ్డాయి (Cricket rivalry). భారత జట్టు రెండు సార్లు గెలిచింది. వెస్టిండీస్ ఒకసారి గెలిచింది. ఇక, 2004 ఆసియా కప్‌లో భారత్, శ్రీలంక మూడు సార్లు తలపడ్డాయి. శ్రీలంక రెండుసార్లు గెలిచింది. భారత జట్టు ఒకసారి గెలిచింది. తాజా ఫైనల్‌లో టీమ్ ఇండియా గెలిస్తే, ఒక టోర్నీలో ఒకే జట్టుపై హ్యాట్రిక్ సాధించిన తొలి అంతర్జాతీయ జట్టుగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి