Kuldeep Yadav Asia Cup 2025: ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:14 PM
ఆసియా కప్ సూపర్ ఫోర్ స్టేజ్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. కీలక మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అదరగొట్టాడు. ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై తన స్పిన్ మాయాజాలాన్ని చూపించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి, భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక దశలో యాదవ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మూడో హ్యాట్రిక్ సాధించే అవకాశం కనిపించింది. కానీ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ నసుమ్ అహ్మద్ ఆ బంతిని రక్షించుకోవడంతో ఈ ఘనత కుల్దీప్‌ను వరించలేదు.
ముగిసేలోపు..
కానీ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన కుల్దీప్, ఆసియా కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో రవీంద్ర జడేజా పేరిట ఉన్న 29 వికెట్ల రికార్డును అధిగమించి, కుల్దీప్ తన వికెట్ల సంఖ్యను 31కి చేర్చుకున్నాడు. ఇప్పుడు అతను శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగా (33 వికెట్లు) రికార్డును సమీపిస్తున్నాడు. కేవలం మూడు వికెట్ల దూరంలో ఉన్న కుల్దీప్, తన ప్రస్తుత ఫామ్‌తో 2025 ఆసియా కప్ ముగిసేలోపు ఈ రికార్డును బ్రేక్ చేసే ఛాన్సుంది.
ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
లసిత్ మలింగా (శ్రీలంక) - 33 వికెట్లు
కుల్దీప్ యాదవ్ (భారత్) - 31 వికెట్లు
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 30 వికెట్లు
రవీంద్ర జడేజా (భారత్) - 29 వికెట్లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 28 వికెట్లు
భారత్ 41 పరుగుల తేడాతో విజయం
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, ఆసియా కప్ ఫైనల్‌లో స్థానం ఖాయం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అద్భుతంగా రాణించాడు. 51 బంతుల్లో 69 పరుగులు సాధించి భారత్‌కు 168 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఔటైన తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శివమ్ దూబె, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్‌లు 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి నిరాశపరిచారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి