Share News

Shreyas Iyer: ఇండియా ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. రెడ్ బాల్ క్రికెట్‌కు 6 నెలల విరామం

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:54 AM

శ్రేయాస్ అయ్యర్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు భారత ఏ జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ గురువారం నియమించింది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 30 నుంచి కాన్పూర్లో జరుగనున్నాయి.

Shreyas Iyer: ఇండియా ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. రెడ్ బాల్ క్రికెట్‌కు 6 నెలల విరామం
Shreyas Iyer

కాన్పూర్‌లో సెప్టెంబర్ 30 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer) ఇండియా ఏ జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. ఇది శ్రేయాస్‌కి భవిష్యత్తులో సీనియర్ వన్డే జట్టులో నాయకత్వ భాద్యతలు చేపట్టే అవకాశం కల్పించనుంది. అయితే, ఆయన వచ్చే ఆరు నెలలు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నారు.


శ్రేయస్ అయ్యర్ ఇటీవల బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగర్కర్‌కు తన వెన్ను గాయం కారణంగా రెడ్-బాల్ క్రికెట్ ఆడలేనని తెలిపారు. గతంలో యూకేలో వెన్ను శస్త్రచికిత్స చేయించుకున్న అయ్యర్, రికవరీ తర్వాత కూడా దీర్ఘకాల ఫార్మాట్ ఆడుతున్నప్పుడు వెన్ను నొప్పి సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల పాటు రెడ్-బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండి, తన శరీర సామర్థ్యాన్ని, ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవాలని నిర్ణయించారు.


ఈ కారణంగా అక్టోబర్ 1 నుంచి నాగ్‌పూర్‌లో విదర్భతో జరిగే ఇరానీ కప్ మ్యాచ్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇండియా ఏ జట్టులో శ్రేయస్ అయ్యర్‌తో పాటు రవి బిష్ణోయ్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్, ఆయుష్ బదోనీ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయాలని భావిస్తోంది.


ప్రస్తుతం ఆసియా కప్ కోసం యూఏఈలో ఉన్న హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, అక్టోబర్ 3, 5 తేదీల్లో జరిగే రెండో, మూడవ వన్డే మ్యాచ్‌ల కోసం జట్టులో చేరనున్నారు. మరోవైపు రజత్ పటిదార్‌ను ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు కెప్టెన్‌గా నియమించారు. ఈ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి నాగ్‌పూర్‌లో విదర్భతో జరగనుంది. శ్రేయస్ అయ్యర్ రెడ్-బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో, రజత్ పటిదార్ ఈ బాధ్యతను స్వీకరించారు.

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. అతని ఫిట్‌నెస్, శారీరక సామర్థ్యం మెరుగుపడిన తర్వాత, మళ్లీ రెడ్-బాల్ క్రికెట్‌లో అతని రాక ఉంటుంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2025 | 12:07 PM