Share News

Ballary: వీడు మామూలోడు కాదు.. కార్లను అద్దెకు తీసుకెళ్లి.. ఆ తర్వాత..

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:08 AM

మీకు కారు ఉందా..? బాడుగకు ఇవ్వాలనుకుంటన్నారా? నాకు చెప్పండి. చాలా పెద్దపెద్ద కంపెనీల వారితో పరిచయం ఉంది. నేను అందులో మీ కారును బాడుగకు పెట్టిస్తాను. మీకు నెలనెలా రెంట్‌ ఇప్పిస్తానని కారు యజమానులను నమ్మిస్తాడు.

Ballary: వీడు మామూలోడు కాదు.. కార్లను అద్దెకు తీసుకెళ్లి.. ఆ తర్వాత..

- ఘరానా మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు

బళ్లారి(బెంగళూరు): మీకు కారు ఉందా..? బాడుగకు ఇవ్వాలనుకుంటన్నారా? నాకు చెప్పండి. నాకు చాలా పెద్దపెద్ద కంపెనీల వారితో పరిచయం ఉంది. నేను అందులో మీ కారును బాడుగకు పెట్టిస్తాను. మీకు నెలనెలా రెంట్‌ ఇప్పిస్తానని కారు యజమానులను నమ్మిస్తాడు. జిందాల్‌, కిర్లోస్కర్‌, బీఎంటీ, ఎన్‌ఎండీసీ లాంటి పెద్ద పెద్ద కంపెనీల పేర్లు దారాళంగా వాడుతాడు. కొత్త కారు బాడుగకు పెడితే నెలకు రూ.65వేలు, ఏడాది గడిచిన కారు పెడితే రూ.50 వేలు ఇలా రేటు అతనే చెబుతాడు. కారుబాడుగ ముందు రెండుమూడు నెలలు ఠంచనుగా యజమాని అకౌంట్‌లలోకి డబ్బు జమచేస్తాడు.


ఆ తరువాతే అతను మోసగాడని యజమానికి అర్థమవుతుంది. కార్లు బాడుగకు పెట్టిస్తానని చెప్పి అవి కనిపించకుండా చేశాడని, మోసపోయామని తెలుసుకున్నాక అందరూ పోలీస్టేషన్‌కు వస్తున్నారు. కార్లు బాగుడ పేరుతో ఘరానా మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్ల వద్ద బాధితులు బారులుతీరారు. ఈ మోసం కథ వింటున్న పోలీసులు కూడా నివ్వెరపోతున్నారు. అసలు ఆ మోసగాడు ఎవరు.. మోస పోయిన బాధితులు ఎంతమంది అంటారా..?


వివరాలు ఇలా...

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన ఎండీ జావేద్‌ బాషా, అలియాస్‌ సోనూ బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో తిరుగుతుంటాడు. ఆయా ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల్లో వివిధ హోదాల్లో పనిచేసే వారికి, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు బాడుగలకు కార్లు పెట్టిస్తానని, కార్లు నెలనెల ఒక రేటు కట్టి బాడుగకు పెట్టిస్తాడు. కారు ఓనర్‌తో ఇతనే మొత్తం డీల్‌ చేస్తాడు. ముందు రెండుమూడు నెలలు కారు ఓనర్లకు సక్రమంగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తాడు.


తరువాత బాడుగ వేకుండా మోసం చేస్తాడు. కొన్ని కార్లు కనిపింకుండా స్ర్కాప్‌కు కూడా వేశాడు. ఈ ఘరానా మోసగాడి చేతిలో మోసపోయిన కార్ల యజమానులు బుధవారం నాటికి 150 మంది అయ్యారు. బళ్లారి బ్రూస్‌పేట పోలీస్టేషన్‌లో బుధవారం 70 మంది కార్ల యజమానులు అతనిపై ఫిర్యాదు చేశారు. కౌల్‌బజార్‌, గాంధీనగర్‌, రూరల్‌ పోలీస్టేషన్ల అలాగే విజయనగర, రాయచూరు జిల్లాల్లోని పోలీస్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు.


దీనిపై జిల్లా ఎస్పీ శోభారాణి మాట్లాడుతూ కార్ల బాడుగ పేరుతో తీసుకుని మోసం చేశాడని జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో ఫిర్యాదులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రానికి 150 మంది వరకు ఫిర్యాదులు చేశారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఓనర్లతో బాడుగకు తీసుకుని సరిహద్దు జిల్లాలోని కొందరి పేకాట ప్రోత్సహించేవారికి కూడా అమ్మినట్లు ఎస్పీ తెలిపారు. రాయదుర్గం, మెల్కాల్మూరు, చెల్లకెర, ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లో ఈ కార్లు ఉన్నట్లు సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 11:11 AM