India Test squad West Indies: విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:09 PM
వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడే జట్టు వివరాలను సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాకు వెల్లడించారు.
వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడే జట్టు వివరాలను సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాకు వెల్లడించారు. గాయం సమస్యతో బాధపడుతున్న రిషభ్ పంత్‌కు స్థానం దక్కలేదు. (India vs West Indies Test)
పంత్ స్థానంలో రవీంద్ర జడేజాకు వైస్-కెప్టెన్‌గా అవకాశం లభించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14 వరకు స్వదేశంలో విండీస్‌తో టీమిండియా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ నాలుగో సీజన్‌లో తొలిసారి భారత్ స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ప్రస్తుతం ఆసియా కప్ కోసం దుబాయ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ సమావేశమయ్యారు. అనంతరం జట్టును ప్రకటించారు.
భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కళ్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, జగదీశన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి