Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్
ABN , Publish Date - Sep 29 , 2025 | 07:18 AM
దుబాయ్‌లో రాత్రి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించి సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండంతో..
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లో రాత్రి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించి సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండంతో, తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు.
ఆసియాకప్ ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండా టీమ్‌ఇండియా దూరంగా ఉండిపోవడంతో భారత్.. ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెజెంటేటర్ ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్ష్ చేసుకున్నారు.
ఆసియా కప్ ఫైనల్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ సూర్య ట్రోఫీని తీసుకోకపోవడంపై స్పందించారు.. తన కెరీర్‌లో ఒక విజేత జట్టు ట్రోఫీని నిరాకరించడం బహుశ ఇదే మొదటిసారి కావచ్చని సూర్య అన్నారు. ట్రోఫీ తీసుకునేందుకు తాము అర్హులమైనప్పటికీ తిరస్కరించినట్లు చెప్పాడు.
ఇక, పాక్ జట్టుకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం, ఆసియా కప్ ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణాలపై పాక్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను సూర్య దాటవేశాడు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమంలోనూ భారత స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకపోవడం విశేషం.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి