Pawan Kalyan: పరమేశ్వరి దీవెనలు ఉండాలి.. ప్రజలకు పవన్ దసరా శుభాకాంక్షలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:23 PM
అందరికీ ఆ పరమేశ్వరి చల్లని దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తుందని తెలిపారు.
అమరావతి: దుష్ట శిక్షణ... శిష్ట రక్షణగావించే శక్తి స్వరూపిణిని నిష్టతో, భక్తిశ్రద్ధలతో కొలిచే శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను విరాజిల్లుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నవరాత్రుల వేళ తెలంగాణలో బతుకమ్మ వేడుకలు, ఆంధ్రప్రదేశ్‌లో ఊరూరా దుర్గాదేవి పూజలు జరుగుతున్నాయని చెప్పారు. భవానీ దీక్షలతో ఈ దసరా ఉత్సవాలు మరింత శోభను సంతరించకున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు దేశ ప్రజలందరికీ విజయ దశమి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ ఆ పరమేశ్వరి చల్లని దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తోందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తూ.. కూటమి ప్రభుత్వం మరింత జనరంజక పాలన సాగిస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి