Share News

Mysore Dussehra celebrations: ఆకాశంలో ‘అమ్మ’ దర్శనం..

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:45 PM

మైసూరు దసరా ఉత్సవాల్లో ఈసారి డ్రోన్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాముండేశ్వరి విద్యుత్‌ సరఫరా కంపెనీ (సెస్క్‌) ఆధ్వర్యంలో బన్నిమంటప మైదానంలో ఆదివారం డ్రోన్‌ షో ప్రారంభమైంది. సుమారు 3వేల డ్రోన్‌లను ఉపయోగించి కొత్త లోకాన్ని సృష్టించారు.

Mysore Dussehra celebrations: ఆకాశంలో ‘అమ్మ’ దర్శనం..

బెంగళూరు: మైసూరు దసరా ఉత్సవాల్లో(Mysore Dussehra celebrations) ఈసారి డ్రోన్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాముండేశ్వరి విద్యుత్‌ సరఫరా కంపెనీ (సెస్క్‌) ఆధ్వర్యంలో బన్నిమంటప మైదానంలో ఆదివారం డ్రోన్‌ షో ప్రారంభమైంది. సుమారు 3వేల డ్రోన్‌లను ఉపయోగించి కొత్త లోకాన్ని సృష్టించారు. ఇందులో 2,983 డ్రోన్‌ల ద్వారా జాతీయ జంతువు పులిని రూపొందించారు.


pandu4.2.jpg

తద్వారా గొప్ప అనుభూతి మిగిల్చిందని సెస్క్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మునిగోపాలరాజు వెల్లడించారు. 2024 ప్రదర్శనలో 1500 డ్రోన్‌లు ఉపయోగించగా ఈసారి రెట్టింపు చేశామన్నారు. ఇందుకోసం డ్రోన్ల ద్వారా విన్యాసాలు రూపొందించేందుకు బృందం ఎంతో శ్రమించిందన్నారు. 200మందిదాకా పాల్గొన్నారు. వీరి శ్రమకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు దక్కిందన్నారు. ప్రధాన ప్రదర్శనలు అక్టోబరు 1, 2 తేదీలలో మరింతగా సందర్శకులను ఆకట్టుకుంటాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.


డ్రోన్‌లతో పలు విన్యాసాలు

డ్రోన్‌ల ద్వారా సోలార్‌ సిస్టమ్‌, వరల్డ్‌మ్యాప్‌, ఆర్మీ సైనికుడు, నెమలి, డాల్ఫిన్‌, గద్ద, పాము తలపై నృత్యం చేస్తున్న శ్రీకృష్ణుడు, కావేరి మాత, కర్ణాటక మ్యాప్‌, ఇంకా సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌, రాష్ట్రప్రభుత్వ గ్యారెంటీ పథకాలు, అంబారి మోస్తున్న ఏనుగు, నాడదేవత చాముండేశ్వరి దేవి వంటివి ప్రదర్శించారు.


pandu4.3.jpg

ప్రదర్శనలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మహదేవప్ప, ఎమ్మెల్యే తన్వీర్‌సేఠ్‌, ఎమ్మెల్సీ కే శివకుమార్‌, ఇన్‌చార్జ్‌ ప్రధాన కార్యదర్శి గౌరవ్‌గుప్త, జల్లా అధికారి లక్ష్మీకాంతరెడ్డి, జిల్లా పంచాయతీ సీఈఓ ఎస్‌ యుకేశ్‌కుమార్‌, సాంకేతిక విభాగం డైరెక్టర్‌ డీజే దివాకర్‌, పాలికె కమిషనర్‌ షేక్‌ తన్వీర్‌ ఆసిఫ్‌, మైసూరు డెవలె్‌పమెంట్‌ అథారిటీ కమిషనర్‌ కేఆర్‌ రక్షిత్‌, సెస్క్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నైరుతిలో సాధారణ వర్షపాతమే

Read Latest Telangana News and National News

Updated Date - Sep 30 , 2025 | 01:45 PM