Durga Idol Immersion: దుర్గామాత నిమజ్జనంలో అపశృతి.. 11 మంది మృతి
ABN , Publish Date - Oct 02 , 2025 | 07:49 PM
దుర్గామాత నిమజ్జనంలో అపశృతి జరిగింది. ఖండ్వా జిల్లాలో దుర్గామాతను నిమజ్జనం కోసం తీసుకెళుతుండగా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో అపశృతి జరిగింది. ఖండ్వా జిల్లాలో గురువారం నాడు దుర్గామాతను నిమజ్జనం కోసం తీసుకెళ్తుండగా.. ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. నీటిలోకి వెళ్లిన తర్వాత ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ట్రాలీ కింద చిక్కి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 8 మంది బాలికలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
జేసీబీ సాయంతో ట్రాలీని బయటకు లాక్కొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాలీలో 25 మంది ఉన్నారు. వారందరూ నీటిలో మునిగిపోయారు. ఇప్పటివరకూ మొత్తం 11 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు చిన్నారులను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందుతోంది. ఇక, అధికారులు మిగిలిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
విజయవాడ ఉత్సవ్‌కు గిన్నిస్ రికార్డ్...
ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఎదుగుతోంది..