Share News

CM Chandrababu On Khadi: ఖాదీ సంత గ్లోబల్‌ సంతగా ఎదుగుతోంది..

ABN , Publish Date - Oct 02 , 2025 | 06:20 PM

గాంధీజీ మనకు సత్యం, అహింస గురించి నేర్పించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఖాదీ రాట్నంతో భారత్‌కు గాంధీజీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు.

CM Chandrababu On Khadi: ఖాదీ సంత గ్లోబల్‌ సంతగా ఎదుగుతోంది..
CM Chandrababu Naidu

విజయవాడ: నగరంలోని ఎస్.ఎస్.కన్వెన్షన్‌లో నిర్వహించిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇవాళ(గురువారం) గాంధీ జయంతి సందర్భంగా.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన చరఖాను స్వయంగా చంద్రబాబు తిప్పారు. అనంతరం స్వదేశీ సంత ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సమీవృక్ష పూజను తెలంగాణలో చాలా బాగా చేస్తారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. సమీవృక్ష ఆకులను తెల్ల బంగారంగా అభివర్ణిస్తారని, శత్రువులంతా నాశనం అవ్వాలని జేబుల్లో వేసుకుంటారని ముఖ్యమంత్రి వివరించారు. దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, అక్కడ ఉన్న చేతి వృత్తుల వారితో మాట్లాడి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.


అనంతరం సీఎం చంద్రబాబు సభలో ప్రసంగించారు. గాంధీజీ మనకు సత్యం, అహింస గురించి నేర్పించారని.. ఖాదీ రాట్నంతో భారత్‌కు ఆయన స్వాతంత్ర్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. జై జవాన్‌, జై కిసాన్‌ నినాదాన్ని లాల్‌బహదూర్‌ శాస్త్రి తీసుకొచ్చారని గుర్తు చేశారు. మార్కెటింగ్‌లో 'ఖాదీ సంత' గ్లోబల్‌ సంతగా ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. స్పేస్‌ టెక్నాలజీలో భారత్‌ దూసుకుపోతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహనీయుడు పీవీ నరసింహారావు అని చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మధుకర్, రమేష్ నాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధూజా తదితరులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

Updated Date - Oct 02 , 2025 | 06:44 PM