Home » Vijayawada News
ఈ ఏడాది దేవీ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. ఈ మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుకున్నారు.
దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఈ మేరకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సహా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఘాట్ రోడ్ మరమ్మతు పనులు చేపట్టనున్నారు అధికారులు.
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక నిందితుడు సురేశ్‌కు కోర్టు సెప్టెంబర్ 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో సురేశ్‌ను నూజివీడు జైలుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తరలించారు.
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న సురేశ్.. సిట్ కార్యాలయంలో లొంగిపోయాడు.
కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దొరక్క.. మత్తు కోసం ‘శానిటైజర్’ రుచి మరిగిన మందుబాబులు ఇప్పటికీ దానిని వదలడం లేదు! లిక్కర్ బ్రాండ్‌ల కంటే తక్కువ ధరకే వస్తుండడంతో దీన్ని తెగ తాగేస్తున్నారు!! దీంతో మెడికల్ షాపుల్లోని శానిటైజర్ బాటిళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
విజయవాడ నగర ప్రజలకు జిల్లా ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. మంగళవారం విజయవాడలో అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా అధికారులు హెచ్చరించారు.
విజయవాడ బీసెంట్ రోడ్డులో సీఎం పర్యటించారు. చిరు, వీధి వ్యాపారులతో ముచ్చటించారు. జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు.
విజయవాడ ఉత్సవ్‌లో కార్నివాల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
గాంధీజీ మనకు సత్యం, అహింస గురించి నేర్పించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఖాదీ రాట్నంతో భారత్‌కు గాంధీజీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు.
విమర్శకుల నోర్లు మూయించేలా తక్కువ సమయంలోనే భారీ ఏర్పాట్లు చేశామని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పున్నమిఘాట్, గొల్లపూడిలో ఎగ్జిబిషన్, తుమ్మలపల్లిలో సంప్రదాయ నృత్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.