Nara Lokesh On Teachers Day: ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ప్రపంచానికి చూపుదాం...
ABN , Publish Date - Sep 05 , 2025 | 09:16 PM
ఇంటర్‌మీడియట్‌కు వచ్చినప్పడు మంత్రి నారయాణ తనకు బ్రిడ్జి కోర్స్ నేర్పించారని మంత్రి లోకేశ్ తెలిపారు. రాజ్‌రెడ్డి తనను గైడ్ చేశారని చెప్పారు. ఫీల్డ్‌లో మంచిగా పనిచేస్తున్న ఉపాద్యాయులతో వారానికి ఒకరితో కుర్చోని మాట్లాడినట్లు పేర్కొన్నారు.
విజయవాడ: తన లైఫ్ టైం టీచర్ సీఎం చంద్రబాబు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీ అని ఆయన గుర్తు చేశారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిగా ఆయన పాల్గొన్నారు. టీచర్ల అందరిని చూసినప్పుడు స్కూల్ డేస్ గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు. తనది బ్యాక్ బెంచ్.. గోడ బ్యాచ్ అయినా తాను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లానని.. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను లోకేశ్ గుర్తుకు తెచ్చుకున్నారు.
విద్యాశాఖ వద్దు అన్నారు..
ఇంటర్‌మీడియట్‌కు వచ్చినప్పడు మంత్రి నారాయణ తనకు బ్రిడ్జి కోర్సు నేర్పించారని మంత్రి లోకేశ్ తెలిపారు. రాజ్‌రెడ్డి తనను గైడ్ చేశారని చెప్పారు. ఫీల్డ్‌లో మంచిగా పనిచేస్తున్న ఉపాద్యాయులతో వారానికి ఒకరితో కుర్చోని మాట్లాడినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు స్కూల్‌లలో బ్యాగులు, పుస్తకాలకు డబ్బులు ఖర్చు చేయాలని అన్నారు. అదే ప్రభుత్వ పాఠశాలలో అన్ని ప్రభుత్వమే అందిస్తుందని స్పష్టం చేశారు. కొన్ని పాఠశాలల్లో అడ్మిషన్లు అయిపోయాయి.. అనే బోర్డులు కనిపించాయని హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నరో తెలుసుకునేలా రిపోర్టు కార్డు రూపోందించి ఇచ్చామని వివరించారు. మంత్రిత్వ శాఖల విషయంలో విద్యాశాఖ వద్దు.. అని ఐటీ, ఇండస్ట్రీస్, ఎనర్జీ వంటివి తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. కానీ తను విద్యాశాఖ కావాలని తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
వన్ క్లాస్ వన్ టీచర్ అమలు చేస్తునాం..
ఉపాధ్యాయ సంఘాలతో అనేకమార్లు కూర్చుని సంస్కరణలు తెచ్చామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇక రాబోయే నాలుగు సంవత్సరాలు సంస్కరణలు ఉండవని స్పష్టం చేశారు. లీప్ మోడల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రైమరీ స్కూళ్లలో 33 శాతం వన్ క్లాస్ వన్ టీచర్ అమలు చేస్తన్నట్లు తెలిపారు.
విద్యకు రాజకీయాన్ని దూరం పెట్టాలని ఉపాధ్యాయులను కోరుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు అందరికీ సీనియారిటీ లిస్టును బట్టి ట్రాన్స్‌ఫర్‌లు చేశామని వెల్లడించారు. ఇందులో 80 శాతం మంది చంద్రబాబు నాయుడు టర్మ్‌లోనే ఉపాధ్యాయులు అయ్యారని వివరించారు. డీఎస్సీ నిర్ణయం ఎంత ఛాలెంజింగ్ విషయమో.. మీ అందరికీ తెలుసని అన్నారు. డీఎస్సీ నిర్వహించిన సంవత్సరమే రిజల్ట్ ఇచ్చి స్కూళ్ళకు వారిని పంపడం చాలా పెద్ద విషయమని ధీమా వ్యక్తం చేశారు.
లూప్ హోల్స్ స్టడీ చేసి మెగా డీఎస్సీ వేశాం..
గత డీఎస్సీ నోటిఫికేషన్‌లలో ఉన్న లూప్ హోల్స్ స్టడీ చేసి మెగా డీఎస్సీ వేశామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏయూ తాను మంత్రిగా వచ్చాక 4 వ స్థానానికి వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్‌లు ఎలా జరిగాయో చూసామన్నారు. జీతాలు 1వ తేదీన రాలేదని ఆరోపించారు. చివరకు ఉపాధ్యాయుల్ని ఎలక్షన్ డ్యూటీలో లేకుండా చేయాలని చూసారని విమర్శించారు. మూడు విషయాలు ఉపాధ్యాయులతో మాట్లాడాలి అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతి క్లాస్ విద్యార్థులకు మ్యాథ్స్ బేసిక్స్ నేర్పించాలని సూచించారు. ఏజ్ అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ అనేది మనవద్ద ఉండాలని సూచించారు. పోటీ పరిక్షల్లో విద్యార్థులు పోటీపడి.. అద్భుతాలు సాధిచేలా ఉపాధ్యాయులు చేయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు మంచి డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా రాష్ట్రం ఇప్పడిప్పుడే కష్టాల నుంచి బయటపడుతుందన్నారు. అందరం కలిసి కట్టుగా ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ప్రపంచానికి చూపుదామని లోకేశ్ ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు