Share News

Wine Shops: బాబ్బాబు దరఖాస్తు వేయండి..

ABN , Publish Date - Sep 04 , 2025 | 10:05 AM

మద్యం బార్ల పాలసీ ఎక్సైజ్‌ అధికారు ల పాలిట శాపంలా మారిందా అంటే చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాగే ఉంటున్నాయి. గతంలో మద్యం వ్యాపారం అంటే పెద్దఎత్తున పోటీ ఉండేది. ప్రభు త్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్ల తో ఖజానా నిండేది. గతంలో వైన్స్‌ లైసె న్సుల జారీలోనూ ఇదే పరిస్థితి. అయితే గత నెలలో బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేయగా వ్యాపారుల నుంచి కనీస స్పం దన లేకుండా పోయింది.

Wine Shops: బాబ్బాబు దరఖాస్తు వేయండి..

- బార్లు.. బాదలు.. దరఖాస్తులకు స్పందన అంతంతే

- ఎక్సైజ్‌ అధికారులపై ఉన్నతాధికారుల కన్నెర్ర

- అన్నింటికీ లాటరీ జరగాలని అనధికారిక ఆదేశాలు

- నిర్దేశించిన స్థాయిలో దరఖాస్తులు రాకుంటే పోస్టింగులకే ముప్పు?

- గడువు పొడిగిస్తున్నా ముందుకురాని వ్యాపారులు.. తాజాగా రీనోటిఫికేషన్‌

నూతన ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం మద్యం బార్లకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. రీ నోటి ఫికేషన్‌ జారీ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మొత్తం బార్లకు లాటరీ ప్రక్రియ జరగాల్సిందేనని ఉన్నతాధికారులు హెచ్చరించారు. దీంతో వ్యాపారులు దరఖాస్తులు వేసేలా ఎక్కడికక్కడ ఎక్సైజ్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో బెదిరించగా వ్యాపారులు స్పందించలేదు. దీంతో ఇప్పుడు బతిమిలాడుకుంటున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలను కలిసి దరఖాస్తుల గండం నుంచి గట్టెక్కించాలని అభ్యర్థిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి నాలుగు దరఖాస్తులు వేస్తే ఆ బార్‌ వారికే వచ్చేలా చూస్తామని అధికారులు హామీ ఇస్తున్నట్లు సమాచారం. నిబంధనల విషయంలో కొంత లిబరల్‌గా కూడా ఉంటాం ముందు దరఖాస్తు చేయండని కూడా కోరుతున్నారు.

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)


మద్యం బార్ల పాలసీ ఎక్సైజ్‌ అధికారు ల పాలిట శాపంలా మారిందా అంటే చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాగే ఉంటున్నాయి. గతంలో మద్యం వ్యాపారం అంటే పెద్దఎత్తున పోటీ ఉండేది. ప్రభు త్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్ల తో ఖజానా నిండేది. గతంలో వైన్స్‌ లైసె న్సుల జారీలోనూ ఇదే పరిస్థితి. అయితే గత నెలలో బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేయగా వ్యాపారుల నుంచి కనీస స్పం దన లేకుండా పోయింది. గడువు పొడి గించినా మూడో వంతు బార్లకు కూడా లాటరీ తీయలేకపోయారు. ఈ పరిస్థి తుల్లో తాజాగా ఎక్సైజ్‌ శాఖ రీ నోటిఫి కేషన్‌ జారీ చేసింది. బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారం భించింది.


అయితే దరఖాస్తులు వేసేందుకు వ్యాపా రులు ముందుకు రాకపోవడంతో అధికా రుల బాధలు వర్ణనాతీతంగా ఉంటు న్నాయి. ఒకవైపు ఉన్నతాధికారుల హెచ్చరి కలు.. మరోవైపు వ్యాపారుల నుంచి స్పందన అంతంతే కావడంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో అధికారులు ఉన్నా రు. రెండు సార్లు గడువు పొడిగించినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవ డంతో రెండు రోజుల క్రితం బాపట్ల జిల్లా ఈఎస్‌ను కమిషనర్‌ కార్యాలయంలో రిపో ర్టు చేయించారు. బార్ల ఏర్పాటుకు ప్రభు త్వం నిర్దేశించిన స్థాయిలో దరఖాస్తులు పడకపోతే వాటి పరిధిలోని ఎక్సైజ్‌ సీఐ లపై కూడా వేటు తప్పదనే సంకేతాలను ఉన్నతాధికారులు పంపించారు.


ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 67, పల్నాడులో 30 బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం తాజాగా రీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 14 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు, 15న లాటరీ ప్రక్రియ ముగించి బార్లను కేటాయించాలని అందు లో తెలిపింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు దరఖాస్తుదారుల కోసం వేట మొదలుపెట్టారు. గతంలో నో టిఫికేషన్‌ వచ్చిన సమయంలో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిపై ఎక్పైజ్‌ అధికారులు దృష్టి పెట్టారు. దరఖాస్తు చేయడానికి వారికున్న సాదకబాధకాలు పరిష్కారా నికి హామీ ఇస్తున్నారు. ముందు బార్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయాలని కోరుతున్నారు.


నేతల వద్దకు క్యూ..

బార్ల దరఖాస్తుల అంశాన్ని ఉన్నతాధికారులు అత్యంత ప్రయారిటీగా తీసుకోవడం ఒక ఎత్తయితే, స్పందన లేకపోతే పోస్టింగే ప్రమాదంలో పడే అవకాశాలు ఉండడంతో ఎక్సైజ్‌ అధికారులు ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా నియోజక వర్గాల్లో కీలకంగా ఉండే అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లి ఎలాగైనా బార్లకు దరఖాస్తులు పడేలా చూడాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న ఆశావహులకు నేతలతో ఫోన్లు చేయిస్తు న్నారు. ఇప్పటికే మద్యం షాపులు నిర్వహిస్తున్న వారిని, ఆర్థికంగా బలంగా ఉండి గతంలో ఈ రంగంలో ఉన్నవారిని కలిసి దరఖాస్తులు వేయించేలా అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


వ్యాపారం చేయలేం..

ఇప్పటికే మద్యం షాపుల విషయంలోనే పడుతూ లేస్తూ వ్యాపారం చేస్తున్నామని కొత్తగా బార్ల భారాన్ని మోయలేమని వ్యాపారులు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. పాలక పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయిలో ఉండే ఎక్సైజ్‌ సిబ్బందికి ఇలా ప్రతి ఒక్కరికీ ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, ఇవన్నీ బేరీజు వేసుకుని వ్యాపారం చేసేకన్నా మిన్నకుండడమే మేలనే అభిప్రాయాన్ని ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. బార్ల విషయంలో ప్రభుత్వం లైసెన్స్‌ ఫీజు విషయంలో పునరాలోచన చేస్తుందని అనుకున్నాం కానీ ఇలా అధికారులను తమపైకి పంపి ఒత్తిడి పెడుతుందను కోలేదని వ్యాపారులు వాపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 10:07 AM