Telangana Governor Son: నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:34 AM
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడు ప్రతీక్ దేవ్ వర్మ తనని, తన కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ త్రిపురకు చెందిన ఓ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు.
త్రిపుర ఎమ్మెల్యేకు తెలంగాణ గవర్నర్ కుమారుడి బెదిరింపులు
అగర్తల, సెప్టెంబరు 3: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడు ప్రతీక్ దేవ్ వర్మ తనని, తన కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ త్రిపురకు చెందిన ఓ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. త్రిపుర మోథ పార్టీ ఎమ్మెల్యే ఫిలిప్ కుమార్ రియాంగ్ ఈ ఫిర్యాదు చేశారు. రియాంగ్ ఫిర్యాదు ప్రకారం.. ఎమ్మెల్యే ఫిలిప్ కుమార్ రియాంగ్ తన కుటుంబసభ్యులతో ఓ చర్చలో ఉండగా ప్రతీక్ వర్మ సహా నలుగురు యువకులు అందులో జోక్యం చేసుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని రియాంగ్ కోర గా దూషణలకు దిగి, బెదిరింపులకు పాల్పడ్డారు. రియాంగ్ గొంతు కోసి చంపేస్తామని, 400-500 మంది బీజేపీ కార్యకర్తలను తీసుకొచ్చి రియాంగ్; అతని కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో రియాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... ప్రతీక్, ఇతర నిందితులు మంగళవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. ఆ వెంటనే వారికి బెయిల్ మంజూరైంది.