CM Chandrababu Visit: బీసెంట్ రోడ్‌లో సీఎం చంద్రబాబు దీపావళి విక్రయాల పరిశీలన
ABN , Publish Date - Oct 19 , 2025 | 07:26 PM
విజయవాడ బీసెంట్ రోడ్డులో సీఎం పర్యటించారు. చిరు, వీధి వ్యాపారులతో ముచ్చటించారు. జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు.
విజయవాడ, అక్టోబర్ 19: విజయవాడ బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా చిరు, వీధి వ్యాపారులతో సరదాగా ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపుతో తగ్గిన ధరల మేరకే వస్తువులను ప్రజలకు విక్రయిస్తున్నారా? అని సీఎం అడిగి తెలుసుకున్నారు.
పన్ను తగ్గింపుతో దసరా- దీపావళి పండుగలకు విక్రయాలు ఏ మేరకు పెరిగాయని కూడా సీఎం చంద్రబాబు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. బీసెంట్ రోడ్డులో దీపావళి ప్రమిదలు విక్రయిస్తున్న మహిళతో మాట్లాడిన సీఎం.. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి