Delhi Air Quality Hits Dangerous: దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:48 AM
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుంది. హస్తినలో ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో వాయు నాణ్యత భారీగా పడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 19: దీపావళి వేళ.. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుంది. హస్తినలో ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో వాయు నాణ్యత భారీగా పడిపోయింది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. వికాస్‌పురి ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ 238, అక్షర్‌ధామ్ ప్రాంతంలో 426గా నమోదు అయింది. దీంతో రాజధాని ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావట్లేదు. ఈ సీజన్‌లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని సీపీసీబీ వెల్లడించింది.
వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆదివారం ఉదయం వాయు నాణ్యత 269గా నమోదైనట్లు వివరించారు. హస్తినలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాలలో 9 ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరిలోకివచ్చాయని పేర్కొన్నారు. ఆనంద్ విహార్‌లో 389, వజీర్‌పూర్ 351, జహంగీర్‌పురి 310, ద్వారక 310 ఏక్యూఐలతో అత్యంత ప్రభావిత రీజియన్ లుగా ఉన్నాయని చెప్పారు.
సిటీలో వాహన ఉద్గారాలు పెరగడంతో పటు చలికాలం కూడా తొడవగా కాలుష్యం పెరుగుదల తీవ్రమైనట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు తీవ్రమైన జోన్‌లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. దీపావళి నేపథ్యంలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం, వ్యర్థాల దహనం వల్ల ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణించే ఛాన్స్ ఉందని ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి:
Naraka Chaturdashi 2025: భూభారహరణం.. నరకాసురుడి మరణం
Honeytrap Blackmail: ప్రేమ పేరుతో హనీ ట్రాప్.. ప్రియురాలి మోసం భరించలేక..