Naraka Chaturdashi 2025: భూభారహరణం.. నరకాసురుడి మరణం
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:23 AM
ప్రతి ఒక్క రాక్షసుడి మరణం ఒక దేవత రూపంలో రాసిపెట్టి ఉంటుంది. అలాగే నరకాసురుడు మరణం శ్రీ కృష్ణుని భార్య అయిన సత్యభామ చేతిలో రాతిపెట్టి ఉంది. నరకాసురిడి పాపం పండగనే ఆ ఆదిపరాశక్తి సత్యభామ రూపంలో నరకాసురితో భీకర పోరాటం చేసి అనేక అస్త్రశాస్త్రాలను సంధించి నరకాసురిడిని వధించి భూభారహరణం చేసింది.
ఇంటర్ నెట్ డెస్క్, అక్టోబర్ 19: 'పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అని భవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా దేవుడు యుగయుగానికి మనవావతారం ఎత్తి రాక్షసులను దునుమాడుతారు. సాధువులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పునః స్థాపించడానికి ప్రతి యుగానికి తాను అవతారం ఎత్తుతూనే ఉంటానని గీతాబోథలో పరమాత్మ చెప్పారు. రాక్షసులు విచిత్రమైన కోరికలతో విశ్వంలోని శక్తివంతుడిని కావాలని అహంకారంతో పరమశివుని నుంచి వరం తీసుకొని లోకాలన్నిటినీ అతలాకుతలం చేస్తుంటారు. అప్పుడు ఆ శ్రీహరి అవతారం ధరించి రాక్షసులను వదిస్తారు.
ప్రతి ఒక్క రాక్షసుడి మరణం ఒక దేవత రూపంలో రాసిపెట్టి ఉంటుంది. అలాగే నరకాసురుడు మరణం శ్రీ కృష్ణుని భార్య అయిన సత్యభామ చేతిలో రాతిపెట్టి ఉంది. నరకాసురిడి పాపం పండగనే ఆ ఆదిపరాశక్తి సత్యభామ రూపంలో నరకాసురితో భీకర పోరాటం చేసి అనేక అస్త్రశాస్త్రాలను సంధించి నరకాసురిడిని వధించి భూభారహరణం చేసింది. ఈరోజునే మనం నరక చతుర్దశి అని పిలుస్తాము. దీపావళి పండుకకు ఒక రోజు ముందుగా నరక చతుర్దశి వస్తుంది. సత్యభామ విజయంతో మూలల్లోకాలన్నీ దీపకాంతులతో అమ్మవారికి నీరాజనం పలుకుతారు.
నరకాసురుడి వధ.. సత్యభామ వీరోచిత పోరాట గాథ
శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు ఆయన వలన భూదేవికి పుట్టిన కొడుకే నరకుడు. అసుర లక్షణాలతో పుట్టిన నరకుడు జనాలను పీడిస్తూ నరకాసురుడిగా పేరుగాంచాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని, కామరూప దేశాన్ని పరిపాలించసాగాడు. పొరుగు రాజ్యం శోణితపురం రాజు బాణాసురుడితో కుదిరిన మైత్రితో తన కంటికి నచ్చిన అమ్మాయిలను ఎత్తుకొచ్చి కామవాంఛ తీర్చుకునేవాడు. స్వర్గలోకాధిపతి, అమరావతి నరేశులు దేవేంద్రుడు సైతం నరకుడిపై యుద్ధం ఓడిపోయాడు. నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించుకుని దుర్మార్గాలు చేయసాగాడు. ఒకానొక సమయంలో ఆగ్రహించిన వసిష్ఠుడు, ‘దుర్మదాంధుడా! నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు’ అని శపిస్తాడు
ముల్లోకాల్లో నరకుడి బాధలు భరించలేక దేవతలందరూశ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. ‘శ్రీకృష్ణా! పాహిమాం, పాహిమాం! నరకుడి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మమ్మల్నందరినీ తరిమికొట్టి, స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఎదురు చెప్పిన మహర్షులను చెరలో బంధించి హింసిస్తున్నాడు. కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టాడు. నరకుడి దాష్టీకాలతో ధర్మం గాడి తప్పుతోంది. నరకుడిని అంతమొందించగల సమర్థుడవు నువ్వే! అతడిని సంహరించి మమ్మల్ని కాపాడు’ అని ప్రార్థించాడు. ,ముక్కోటి దేవతలు మొరపెట్టుకోవంతో నరకుడిపై యుద్ధానికి శ్రీకృష్ణుడు సమాయత్తమయ్యాడు. అప్పుడు సత్యభామ కూడా ‘నాథా! నేను కూడా యుద్ధానికి వస్తాను. నన్ను కూడా తీసుకువెళ్లండి’ అంటుంది.
గరుడవాహనంపై సత్యభామను వెంట తీసుకొని శ్రీకృష్ణుడు నరకుడిపై దండయాత్రకు బయలుదేరాడు. సుప్రతీకం అనే ఏనుగునెక్కి నరకుడు భారీ సైన్యంతో రణరంగానికి వచ్చాడు. శ్రీకృష్ణుడికి, నరకుడికి మధ్య భారీ యుద్ధం జరుగుతుంది. శ్రీకృష్ణుడితో నరకుడు వెనక్కు తగ్గకుండా పోరాడాడు. నరకుడి బాణం తాకి శ్రీకృష్ణుడు ఒకానొక సమయంలో మూర్చిల్లుతాడు. దీంతో ఆదిశక్తి అంశ అయిన సత్యభామ తీవ్ర ఆగ్రహానికి గురవుతుంది. విల్లంబులు చేతిలోకి తీసుకుని, నరకుడిపై శరపరంపరను కురిపించింది. యుద్ధరంగంలో సత్యభామ ఆదిశక్తిలా విజృంభించి వీరోచిత పోరాటం చేస్తుంది. ఆమెబాణపరంపరకు నరకుడి సేనల్లో అల్లకల్లోలమయ్యాయి. ఈలోగా మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీకృష్ణుడు తన చక్రాన్ని సంధించి, నరకుడి తలను తెగ నరికాడు. నరకుడు అపహరించిన కుండలాలను అదితికి, ఛత్రాన్ని వరుణుడికి అప్పగించాడు. నరకాసుర సంహారం తర్వాత తిరిగి వస్తున్న సత్యభామా శ్రీకృష్ణులకు ద్వారకా పురవాసులు ఇంటి గుమ్మాల ఎదుట దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. దీంతో ఈ పండుగను ప్రతియేటా జరుపుతూ వీరనారి సత్యభామ పోరాట పటిమను గుర్తుచేసుకుంటున్నారు.
ఇవి చదవండి:
Deepavali 2025: అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు.. ఆ మూడు అంశాలే అత్యంత ప్రాధాన్యం
Narak Chaturdashi 2025: ఇవాళే నరక చతుర్దశి.. ఉదయాన్నే ఇలా చేయండి!