Deepavali 2025: అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు.. ఆ మూడు అంశాలే అత్యంత ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:25 AM
మన హిందూ సాంప్రదాయ పండుగలు ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడుతాయి. భౌతికమైన, ఆధ్యాత్మిక మైన, సమాజ హితవుగా ప్రతి పండుగ నిర్వహణ ఉంటుంది. దీపావళి మొదటి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 19: దీపావళి పర్వదినం సమస్త సనాతన ధర్మాన్ని పాటించే వారికి ఒక ముఖ్యమైన పండుగ. అనేక కథలు, పౌరాణిక గాథలు, వీరోచిత పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకునే శుభదినం నేడు. దీపాలు వెలిగించి జ్ఞాన మార్గంలో నడవాలని దీపావళి పండుగలోని అంతరార్ధం. దీపపు వెలుగు చీకటిని పాలద్రోలుతుంది. చీకటిలో ఉన్నప్పుడు పాము ఏదో కర్ర ఏదో తెలియదు. చీకటిలో అది కాలికి తట్టినప్పడు ఎంతో భయపడుతాం. ఒక్కసారి కాంతిని వెలిగించి చూసి అది కర్ర అని తెలుసుకుంటే భయం పోతుంది. మనలో ఉండే అజ్ఞానాన్ని పాలద్రోలి జ్ఞానం అనే వెలుగులని మన జీవితాల్లోకి ఆహ్వానించాలనేదే దీపావళి పండగ సారాంశం.
మన హిందూ సాంప్రదాయ పండుగలు ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడుతాయి. భౌతికమైన, ఆధ్యాత్మిక మైన, సమాజ హితవుగా ప్రతి పండుగ నిర్వహణ ఉంటుంది. దీపావళి మొదటి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. చలికాలం ఎక్కువగా ఉండే సమయం ఇది. ఆస్తమా, అలర్జీలు, వైరల్ జ్వరాలు ప్రబలే రోజులివి. ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండేదుకు, రోగనిరోధక వ్యవస్థ స్ట్రాంగ్ అవ్వడానికి దీపాలు దోహదపడుతాయి. ఆవునెయ్యి, నువ్వులు, వేరు శనగ (పల్లీలు), ఆముదం ఇతర నూనెలతో వెలిగించే దీపం వలన ఆనూనె అగ్నితో చర్య జరిపి ఆరోగ్యకరమైన వాయువులను గాలిలోకి విడుదల చేస్తాయి. దీంతో దీపాలు పెట్టిన స్థలంలో మానసిక ప్రశాంతత, ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉంది. ఇందువల్ల చలికాలంలో ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.
ఇక మూడవది సమాజ శ్రేయస్సు. దీపావళి పండుగ రోజున ఇంటిల్లిపాది కలిసిమెలసి వేడుక జరుపుకుంటారు. సమాజంలోని అందరూ ఒక తాటిపై నడుస్తారు. సమాజం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఇక దీపావళి రోజున గ్రామంలోని వారిని ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెడతారు. పేదలకు కూడా భోజనాలు పెట్టి అన్నార్తిని తీరుస్తారు. ముఖ్యంగా ధన త్రయోదశి రోజున బంగారాన్ని కొనడంతో పాటు దానం చేయడం కూడా శుభ ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. సమాజ శ్రేయస్సు కోసం, మనుష్యుడు భౌతిక,మానసిక ఆరోగ్య పరిస్థిని మెరుగుపరిచేందుకు సనాతన ధర్మం ఏర్పరచుకున్న గొప్ప మార్గం మన పండుగలు.
ఇవి కూడా చదవండి:
Narak Chaturdashi 2025: ఇవాళే నరక చతుర్దశి.. ఉదయాన్నే ఇలా చేయండి!
Gold Sweets: బంగారు మిఠాయి.. కిలో రూ.1,11,000