Gold Sweets: బంగారు మిఠాయి.. కిలో రూ.1,11,000
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:10 AM
మిలమిలలాడే బంగారాన్ని నచ్చిన డిజైన్లలో నగలుగా మార్చుకోవడమే తెలుసు కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే మిఠాయి రూపంలో
24 క్యారెట్ల తినగలిగే గోల్డ్‌తో జైపూర్‌లో తయారీ
మన దేశంలో అత్యంత ఖరీదైన మిఠాయి ఇదే
జైపూర్, అక్టోబరు 18: మిలమిలలాడే బంగారాన్ని నచ్చిన డిజైన్లలో నగలుగా మార్చుకోవడమే తెలుసు కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే మిఠాయి రూపంలో తినొచ్చా? రాజస్థాన్ జైపూర్‌లోని ఓ మిఠాయి దుకాణంలో అమ్ముతున్న ఓ ప్రత్యేకమైన స్వీటే దీనికి సమాధానం చెబుతోంది. అక్కడ ‘స్వర్ణ ప్రసాదం’ పేరుతో బంగారాన్ని మిక్స్ చేసిన మిఠాయిని అమ్ముతున్నారు. ఈ మిఠాయిలో 24 క్యారెట్ల తినగలిగిన బంగారం లేదా స్వర్ణ భస్మాన్ని పొదిగారు. మనదేశంలో ప్రస్తుతం అత్యంత ఖరీదైన మిఠాయి ఇదే. కిలో ‘స్వర్ణ ప్రసాదం’ ధర రూ.1,11,000. స్వీటు తయారీలో అఫ్ఘానిస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే చిల్గోజా అనే అత్యంత ఖరీదైన డ్రైఫ్రూట్‌ను వాడారు. కుంకుమ పువ్వు, పైన్ నట్స్‌తో గార్నిష్ చేశారు. ఈ స్వీటులో స్వర్ణ భస్మం అనే 24 క్యారెట్ల బంగారాన్ని మిక్స్ చేస్తున్నామని షాపు యజమాని అంజలి జైన్ చెప్పారు.