Honeytrap Blackmail: ప్రేమ పేరుతో హనీ ట్రాప్.. ప్రియురాలి మోసం భరించలేక..
ABN , Publish Date - Oct 19 , 2025 | 07:57 AM
నిరీక్షతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ఫోన్లను కూడా చెక్ చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
ప్రియురాలి మోసం భరించలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. 7 పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉడిపి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కార్కల్ తాలూకాలోని నిట్టె గ్రామానికి చెందిన అభిషేక్ అనే యువకుడు ఐటీఐ చదివాడు. మంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మెడికల్ ఎక్యుప్‌మెంట్ సర్వీస్‌లో పని చేస్తున్నాడు. వేరే ఆస్పత్రిలో నర్సుగా పని చేసే నిరీక్ష అనే యువతితో అభిషేక్‌కు కొన్ని నెలల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
కొంతకాలం పాటు ఇద్దరూ చనువుగా తిరిగారు. పలుమార్లు ఏకాంతంగా కలిశారు. ఈ నేపథ్యంలోనే కథలో అసలు ట్విస్ట్ బయటపడింది. తమ ప్రైవేట్ ఫొటోలతో నిరీక్ష బెదిరింపులకు దిగింది. డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానంది. దీంతో భయపడిపోయిన అభిషేక్ 4 లక్షల రూపాయల వరకు ఇచ్చాడు. అంతటితో నిరీక్ష వేధింపులు ఆగలేదు. ఆమె వేధింపులు భరించలేకపోయిన అభిషేక్ ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. 7 పేజీల డెత్ నోట్ రాశాడు. లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జీకి వెళ్లారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డెత్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిరీక్షతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ఫోన్లను కూడా చెక్ చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా అసలు విషయం బయటపడింది. హనీ ట్రాప్ కోణం బయటపడింది. అభిషేక్ మరణానికి కారణమైన నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
బ్యాంకాక్ రోడ్డుపై ఇండియన్ పిచ్చిపని.. దెబ్బకు ఏడ్చేశాడు..
ప్రేమిస్తే... కచ్చితంగా మారతారు