Tirumala Garuda Seva: తిరుమలలో గరుడ సేవకు భారీగా భక్తులు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:32 AM
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి గరుడ సేవను తిలకించడానికి ఇప్పటికే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మాడ వీధుల్లోని గ్యాలరీలు ఇప్పటికే దాదాపుగా నిండిపోయాయని చెప్పుకొచ్చారు.
తిరుమల, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) వారి గరుడ సేవ (Garuda Seva)ను తిలకించడానికి ఇప్పటికే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Kumar Singhal) తెలిపారు. మాడ వీధుల్లోని గ్యాలరీలు ఇప్పటికే దాదాపుగా నిండిపోయాయని చెప్పుకొచ్చారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం నుంచి నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని వివరించారు ఈవో అనిల్ కుమార్.
ఇవాళ(ఆదివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. మాడ వీధులకు వెలుపల ఉన్న భక్తులకు కూడా గరుడ వాహన సేవ దర్శనం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మూల విరాట్టు దర్శనం కోసం కూడా వేలాది మంది భక్తులు క్యూ లైనల్లో వేచి ఉన్నారని చెప్పుకొచ్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసి.. సర్వదర్శనం క్యూ లైన్ గుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం:మంత్రి కందుల దుర్గేష్
గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News