Share News

Krishna And Godavari Rivers: నిలకడగా కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం

ABN , Publish Date - Sep 29 , 2025 | 08:38 AM

కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం నిలకడగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొన్నారు.

Krishna And Godavari Rivers: నిలకడగా కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం
Krishna And Godavari Rivers Flood Flow

అమరావతి, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదుల (Krishna And Godavari Rivers) వరద ప్రవాహం నిలకడగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో- 6,86,074 క్యూసెక్కులు ఉందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.


గోదావరి వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదే..

మరోవైపు.. భద్రాచలం (Bhadrachalam) వద్ద ప్రస్తుతం 44.4 అడుగుల మేరకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం (Dhavaleswaram) వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,80,447 లక్షల క్యూసెక్కులు ఉందని వివరించారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. 2NDRF, 3SDRF బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. కృష్ణా, గోదావరి నది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు: ఎంపీ కేశినేని శివనాథ్

తిరుమలలో గరుడ సేవకు భారీగా భక్తులు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 08:46 AM