Home » Godavari
గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో గోదారి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. రెండవ ఆర్చి గేటు నుంచి ఆలయానికి వెళ్లే రహదారిపై వరద వచ్చి చేరింది.
గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.
కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం నిలకడగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొన్నారు.
ప్రకాశం బ్యారేజి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుర్గమ్మ భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. అటు, గోదావరి వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులు..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికలకు చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. భద్రాచలం వద్ద 44.9లక్షలు, ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బ్యారేజ్ వద్ద గంట గంటకూ గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.
మల్లన్నసాగర్ నుంచి మహా నగరానికి గోదావరి జలాలను తీసుకురావడంతో పాటు, జంట జలాశయాలను నింపి మూసీనదిలో ప్రవహింపజేసే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌లు చకచకా మొదలయ్యాయి.