Share News

Krishna Godavari Flood Alert: ఉధృతంగా కృష్ణా, గోదావరి నదులు..

ABN , Publish Date - Sep 27 , 2025 | 06:38 PM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికలకు చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. భద్రాచలం వద్ద 44.9లక్షలు, ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

Krishna Godavari Flood Alert: ఉధృతంగా కృష్ణా, గోదావరి నదులు..
Krishna Godavari Flood Alert

అమరావతి, సెప్టెంబర్ 27: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికలకు చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టం ఉండగా.. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం మరికొన్ని గంటల్లో 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం కనిపిస్తోంది.


అటు, కృష్ణానది వరద పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 3.74లక్షల క్యూసెక్కులు ఉంది. 4.5 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101కు ప్రజలు ఫోన్ చేయాలని సూచించారు.


మరోవైపు నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..

షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2025 | 07:50 PM