Bangkok sinkhole: షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:07 AM
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో షాకింగ్ సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. 50 మీటర్ల లోతున భారీ గుంట పడింది. బ్యాంకాక్‌లోని వజీరా హాస్పిటల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో షాకింగ్ సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. 50 మీటర్ల లోతున భారీ గుంట పడింది. బ్యాంకాక్‌లోని వజీరా హాస్పిటల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (50 meter sinkhole).
బుధవారం ఉదయం సమ్సెన్ రోడ్డులోని వజీరా ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రధాన రహదారి ఉన్నట్టుండి కుంగిపోయిది. 50 మీటర్ల లోతుకు కూరుకుపోయింది (Thailand road collapse). విద్యుత్ స్తంభాలు కూలిపోయి, కరెంటు తీగలు గాల్లో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. నీటి పైపులైన్లు పగిలిపోయి పెద్ద ఎత్తున నీరు పైకి ఉబికి వచ్చింది. ఈ ప్రమాదం వల్ల సమీపంలోని భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో జరుగుతున్న భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల కారణంగానే భారీ గొయ్యి ఏర్పడిందని బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపాంట్ స్పష్టం చేశారు (sinkhole swallows car).
ఆ ఘటనకు సంబంధించిన వీడియో (sinkhole video) ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటన జరిగిన హాస్పిటల్ నుంచి రోగులను, సమీప అపార్ట్‌మెంట్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌లో ఐఫోన్ రేటెంతో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.. కిడ్నీ అమ్మినా కుదరదేమో..
మీ కళ్లకు పవర్ ఉంటే.. ఈ అడవిలో చిరుతను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..