iPhone 17 price Pakistan: పాకిస్థాన్‌లో ఐఫోన్ రేటెంతో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.. కిడ్నీ అమ్మినా కుదరదేమో..
ABN , Publish Date - Sep 22 , 2025 | 03:42 PM
ఆపిల్ తాజాగా తన 17 సిరీస్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో, కళ్లు చెదిరే ధరలతో వీటిని ఈ నెల 9వ తేదీన లాంఛ్ చేసింది. సాధారణంగా ఐఫోన్‌లు అనేవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలని జోక్ చేస్తుంటారు.
ఆపిల్ తాజాగా తన 17 సిరీస్ ఫోన్లను (iPhone 17) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో, కళ్లు చెదిరే ధరలతో వీటిని ఈ నెల 9వ తేదీన లాంఛ్ చేసింది. సాధారణంగా ఐఫోన్‌లు అనేవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలని జోక్ చేస్తుంటారు. ఐఫోన్ 17 బేస్ వేరియంట్ ధరను మన దేశంలో 83 వేల రూపాయలుగా నిర్ణయించారు. అదే ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ.1.5 లక్షల నుంచి ప్రారంభమవుతోంది (iPhone 17 Price).
మన పొరుగు దేశంలో పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర వింటే నివ్వెరపోవాల్సిందే (Apple Pakistan). ఇటీవలి ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ రూపాయి విలువ భారీగా పతనమైంది. దీంతో పాకిస్థానీలు ఐఫోన్లు కొనాలంటే లక్షలు పట్టుకోవాల్సిందే. ఐఫోన్ 17 ధర పాకిస్థాన్ కరెన్సీ ప్రకారం 3.65 లక్షలు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర 5.73 లక్షల పాకిస్థానీ రూపాయలు. పాకిస్థానీ కరెన్సీ ప్రకారం ఐఫోన్ 17 ధర 3.65 లక్షలు కాగా, మన దేశ కరెన్సీలోకి మారిస్తే 1.01 లక్షల రూపాయలు. అంటే భారత్‌లో అమ్మే ఐఫోన్ 17తో పోల్చుకుంటే దాదాపు 18 వేల రూపాయలు అదనం (Apple iPhone 17 news).
పాకిస్థాన్‌లో ఐఫోన్ల ధరలు అంటూ ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది (iPhone 17 viral post). ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. పాకిస్థానీలు ఐఫోన్ కవర్లు కొనాలన్నా చాలా కష్టమేమో అని ఒకరు కామెంట్ చేశారు. అది ఐఫోన్ ధరలా లేదు.. బంగారం ధరలా ఉందని మరొకరు పేర్కొన్నారు. ఇంత డబ్బుతో, మనం ఒక చిన్న కారు కొనవచ్చు లేదా ఎవరైనా ఉచితంగా కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవచ్చని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. నీ తెలివికి సలాం తల్లీ.. వంట వీడియోను ఎలా షూట్ చేస్తోందో చూడండి..
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 49 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..