Godavari River Rising: గోదారమ్మ ఉగ్రరూపం.. బాసరకు తగ్గిన భక్తుల రద్దీ
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:22 AM
గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.
నిర్మల్, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. గోదారమ్మ కూడా ఉగ్రదరూపం దాల్చుతూ ఉరకలు పెట్టింది. బాసరలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహించింది. అయితే ప్రస్తుతం బాసరలో వరుణుడు కరుణించినా... గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి (Basara Saraswati Devi Temple) పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.
రెండవ ఆర్చి గేటు నుంచి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద వచ్చి చేరింది. ఈ క్రమంలో అధికారులు బస్టాండ్ మీదుగా ఆలయానికి వాహనాలను మళ్లిస్తున్నారు. గోదావరి నదిపై బారికేడ్ల ఏర్పాటు చేశారు. వరద ప్రభావంగా అధికంగా ఉండటంతో గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు అధికారులు నిరాకరించారు.
పెరుగుతున్న వరద
అటు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద క్రమ క్రమంగా పెరుగుతోంది. 44.30 అడుగుల వద్ద 9,88,792 క్యూసెక్కుల గోదావరి నీటి ప్రవాహం కొనసాగతోంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 12.220 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవాహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భారీ వరద నీటితో మేడిగడ్డ బ్యారేజీకి జలకళ సంతరించుకుంది. బ్యారేజీలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10,07,530 క్యూసెక్కులుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
Read Latest Telangana News And Telugu News