CM Revanth on Godavari Pushkaralu: గోదావరి, కృష్ణా పుష్కరాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:14 PM
గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గోదావరి, కృష్ణా పుష్కరాల (Godavari Pushkaralu) నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఇవాళ(శుక్రవారం) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు. శాశ్వత ప్రాతిపదికన సెంట్రిక్ ఘాట్స్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతోపాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రత్యేకంగా జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రస్తుతం ఉన్న ఘాట్స్‌ను విస్తరించడంతోపాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. పుష్కరాల సమయంలో దాదాపు రెండు లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రతీ ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా ఘాట్స్ డిజైన్లు రూపొందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల్లో పర్యాటక శాఖ, నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News