AP Flood Waters: ఏపీలో నదుల ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:01 PM
ప్రకాశం బ్యారేజి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుర్గమ్మ భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. అటు, గోదావరి వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులు..
అమరావతి, సెప్టెంబర్ 28 : కృష్ణానది వరద ప్రవాహం ఇవాళ మరింత పెరిగింది. నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీకాగా, ఇవాళ విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజి ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
దుర్గమ్మ శరన్నవరాత్రులకు విజయవాడ వచ్చే భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. హెచ్చరిక సూచనలు, జాగ్రత్తలు భక్తులు తప్పక పాటించాలని కోరుతున్నారు.
అటు, గోదావరి వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 42.4 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
నిన్న విడుదల చేసిన మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కృష్ణా, గోదావరి నదిపరీవాహక ప్రాంత ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి
ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి