Home » Flood Victims
వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు తమ పెద్ద మనసుతో ముందుకు వస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ మొత్తాల్లో విరాళాలను అందిస్తున్నారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా ఐక్య సంఘాల నాయకులు, పొదుపు మహిళలు విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు.
నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వరదల ధాటికి ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. 101 మంది గాయపడ్డారు. 56 మంది ఆచూకీ దొరకడంలేదని ఆదివారం అధికారులు తెలిపారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలమవుతుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఉదయానికి మృతుల సంఖ్య 112కు చేరిందని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదివారం ఖాట్మాండ్లో వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారన్నారు.
నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి కనీసం 66 మంది మృత్యువాత పడ్డారు.
ఏలేరు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. భారీ వానలకు జలాశయానికి గంటగంటకు వరద ఉద్ధృతి పెరుగుతోందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.భాస్కరరావు తెలిపారు.
Andhrapradesh: ఏపీ వరద బాధితులకు సుప్రీం కోర్టు తెలుగు న్యాయవాదులు విరాళం అందజేశారు. దాదాపు రూ.15లక్షలు విరాళంగా ఇచ్చారు. బుధవారం నాడు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌ను కలిసి తెలుగు న్యాయవాదులు చెక్కులు అందజేశారు.
వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్‌తో పనిచేశారని, ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10 -11 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలూగా సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు.
విజయవాడ వరదలకు బ్యాక్టీరియా వల్ల కాలు కోల్పోయిన బాధితుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక సాయం అందజేసి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. రూ. 10 లక్షల ఎల్ఓసీ ఇస్తూ లేఖ విడుదల చేశారు. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో వరదల వల్ల వచ్చిన బాక్టీరియాతో బాధితుడు ఒక కాలు కోల్పోయాడు.
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.