చేపల వేట హద్దుల కోసం పడవల పోటీలు

ABN, Publish Date - Nov 27 , 2025 | 05:44 PM

కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి కె.గంగవరం మండలం కోటిపల్లి వరకు సుమారు 25 కిలోమీటర్లు మేర పడవల పోటీలు జరిగాయి. పొటీలలో సుమారు 90 పడవలతో మత్స్యకారులు బృందాలుగా పాల్గొన్నారు.

కోనసీమ జిల్లా, నవంబర్ 27: కాట్రేనికోనలో మత్స్యకారుల పడవల పోటీలు జరిగాయి. గోదావరిలో మత్స్యకారుల హద్దుల కోసం ఈ పోటీలు ఏటా జరుగుతుంటాయి. ఈ పందెంలో మత్య్య సంపద అధికంగా దొరికే ప్రాంతాలకు ముందుగా చేరి.. లంగరు వేసిన వారికి ఏడాది పాటు ఆ ప్రాంతంలో చేపలపై హక్కులు ఉంటాయి. అంతకమించి పై ప్రాంతంలో వేట సాగించకుండా నిషేధం. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి కె.గంగవరం మండలం కోటిపల్లి వరకు సుమారు 25 కిలోమీటర్లు మేర ఈ పడవల పోటీలు జరిగాయి. పొటీలలో సుమారు 90 పడవలతో మత్స్యకారులు బృందాలుగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో ఈ పడవ పోటీలు నిర్వహిస్తారు.


ఇవి కూడా చదవండి..

పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..

ఈ విద్యార్థులను పట్టుకోవడం ఎవరితరమూ కాదేమో.. ఎలా కాపీ కొడుతున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Nov 27 , 2025 | 05:44 PM