Share News

Godavari River Floods: వరద ప్రవాహంతో నీట మునిగిన రోడ్లు.. నాటుపడవలపైనే రాకపోకలు

ABN , Publish Date - Oct 01 , 2025 | 10:14 AM

అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి.

Godavari River Floods: వరద ప్రవాహంతో నీట మునిగిన రోడ్లు.. నాటుపడవలపైనే రాకపోకలు
Godavari River Floods

రాజమండ్రి, అక్టోబర్ 1: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో బ్యారేజ్ వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.40 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. దాదాపు 12.25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. వరద ప్రవాహంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రోడ్లు నీటమునిగిపోవడంతో నాటుపడవలపైనే ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు.


అటు అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి. మరోవైపు వరద ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద ప్రభావంతో వేలాది ఎకరాల్లో మిర్చి, ఉద్యాన, కాయగూరలు పంటలు నీట మునిగారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో అద్బుత ఘట్టం

ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2025 | 10:41 AM