Home » Rajahmundry
బాలయోగి జయంతి రోజున రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చామని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాజమండ్రి నుంచి తిరుపతికి 35 టిక్కెట్లకు రూ.1999..
అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి.
మిర్చి పంట వరద నీటిలో మురిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి.
రాజమండ్రిలో జరుగుతున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉమెన్స్ సింగిల్స్‌లో విన్నర్ గా ఏపీకి చెందిన సూర్య చరిష్మా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టోర్నమెంట్‌కి ఇండియా తరఫున..
ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.
CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని అన్నారు.
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
Kandual Vs Perninani: మాజీ మంత్రి పేర్నినాని కామెంట్స్‌పై మంత్రి కందుల దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తి చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అంటూ నిలదీశారు.
ఉదయం లేవడంతోనే ఒక టీ పడాల్సిందే.. లేదంటే తెల్లారదు.. ముఖంలో ఆ అలసట కనిపిస్తూనే ఉంటుంది.. ఒక చుక్క పడితే.. ఆ ఛాయ్ చమక్కులే చూడరా బాయ్ అని చిరంజీవి అన్నట్టు ఉంటుంది.. డిమాండ్ ఉండడంతో వీధికో టీ దుకాణం వెలసింది.. ఒక్క రాజమ హేంద్రవరంలోనే ప్రతి రోజూ సుమారు 6 లక్షల మంది టీ తాగుతున్నట్టు సమాచారం.. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి ఉంటుంది.. అయితే డిమాండ్‌కు తగినట్టు నకిలీ టీపొడి విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. అయినా పట్టించుకునేవారే లేరు.
Subrahmanyam Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ హత్యపై తదుపరి విచారణ కోరుతూ రాజమండ్రి అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలైంది.