Share News

Nara Lokesh: రాజమండ్రికి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:06 AM

మంత్రి నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో మంత్రికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Nara Lokesh: రాజమండ్రికి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి
Nara Lokesh

రాజమహేంద్రవరం, డిసెంబర్ 19: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు (శుక్రవారం) రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తన వద్దకు వచ్చిన మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. అనంతరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన లోకేష్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. బూరుగుపూడి, గాడాల గ్రామంలో మంత్రికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ జంక్షన్ వద్దకు చేరుకున్న లోకేష్‌కు పార్టీ జెండాలు, డప్పులు, బాణా సంచాలతో పెద్ద ఎత్తున తెలుగు దేశం నేతలు, ప్రజలు స్వాగతం పలికారు. ఆపై లాలాచెరువు జంక్షన్‌లో కూడా మంత్రిని ఘన స్వాగతించారు టీడీపీ శ్రేణులు.


ఇక జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను మంత్రి మొదలుపెట్టనున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు నూతన భవనాలను లోకేష్ ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పలు నూతన భవనాలను ప్రారంభిస్తారు.


అనంతరం రాజమండ్రిలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు. అలాగే రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు.


ఇవి కూడా చదవండి...

శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 12:27 PM