Share News

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

ABN , Publish Date - Dec 19 , 2025 | 09:32 AM

శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయడంపై యువతి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న రీల్స్ తనవే అని... శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు
Srisailam Temple Reels

నంద్యాల, డిసెంబర్ 19: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థాన (Srisalam Temple) పరిధిలో భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా రీల్స్ చేసిన యువతిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో నిబంధనలకు విరుద్దంగా రీల్స్ చేసిన వీడియో వైరల్‌పై యువతి స్పందించింది. తాను దేవాలయంలో డ్యాన్స్ చేయలేదని, ఒకవేళ తప్పు చేసి ఉంటే క్షమించాలని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది. మీడియాలో, ఇన్‌ స్టాలో, యూట్యూబ్‌లలో ఓ వీడియో ట్రోల్ అవుతున్నదని.. అది తనదే అని చెప్పింది. మూడు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లినట్లు తెలిపింది.


శ్రీశైలంలో లొకేషన్ బాగుందని ఒక పోప్ సాంగ్ వీడియో తీసుకున్నానని చెప్పింది. పోప్ సాంగ్‌లో శారీ కట్టుకుని సాంప్రదాయంగానే వీడియోలో డ్యాన్స్ చేశానని.. చిన్నచిన్న బట్టలు వేసుకుని బ్యాడ్‌గా బిహెవ్ చేయలేదని వివరించింది. టెంపుల్ బయట వీడియో చేశానని.. ఒకవేళ తప్పుగా చేసి ఉంటే తనను క్షమించండి అని అంటూ యువతి వీడియో రిలిజ్ చేసింది.


మరోవైపు శ్రీశైలం దేవస్థానం అధికారులు కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. శ్రీశైలం పరిసరాలలో క్షేత్ర పరిధిలోని ప్రధాన వీధులలో భక్తులు, స్థానికులు ఎవరూ కూడా వీడియోలు తీయకూడదని, రీల్స్ చేయకుడదని దేవస్థానం ప్రకటించింది. దేవస్థానం అనుమతి లేకుండా క్షేత్ర పరిధిలో శ్రీశైలంలో ఎక్కడైనా వీడియోలు, ఫోటోలు తీస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని శ్రీశైలం దేవస్థానం అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత

వీరితో పోటీ కన్నా.. ఎన్నికల్లో పోటీ తేలిక

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 11:08 AM