Nara Lokesh: వీరితో పోటీ కన్నా.. ఎన్నికల్లో పోటీ తేలిక
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:00 AM
చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడంపై ఆయన తనయుడు, మంత్రి లోకేశ్ స్పందించారు.
తండ్రి, తల్లి, భార్యకు అవార్డులపై లోకేశ్ ట్వీట్
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రావడంపై ఆయన తనయుడు, మంత్రి లోకేశ్ స్పందించారు. ‘నా తండ్రి బిజినెస్ రిఫార్మర్ అఫ్ ద ఇయర్’ అవార్డు గెలుచుకున్నారు. తల్లి భువనేశ్వరి గోల్డెన్ పీకాక్ అవార్డును ఇంటికి తీసుకొచ్చారు. సతీమణి బ్రాహ్మణి.. ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమన్ ఇన్ బిజినెస్'గా గుర్తింపు పొందారు. ఇలాంటి కుటుంబ సభ్యులతో పోటీపడడం కన్నా.. ఎన్నికల్లో పోటీ చేయడం చాలా తేలిక అనిపిస్తోంది’ అని ‘ఎక్స్’ వేదికగా చమత్కరించారు. చంద్రబాబుకు అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమని.. ఏపీకి, తమ కుటుంబానికి ఇది ఎంతో ప్రత్యేకమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్లిన అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరని జ్యూరీ పేర్కొందన్నారు.
ఒక మీటర్ భూగర్భ జలం పెరిగితే...
రూ.5 వేల కోట్ల ఆదా
రాష్ట్రంలో నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. స్వర్ణాంధ్ర 2047కు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై తనకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కలెక్టర్లతో పంచుకున్నారు. ‘‘వర్షాకాలం పూర్తయ్యేనాటికి భూగర్భజలాలు 3 మీటర్లుండాలి. వచ్చే ఏడాదికి నీటి వనరులు 95 శాతం అందుబాటులో ఉండాలి. ఒక మీటరు భూగర్భజలం పెరిగితే 745 టీఎంసీల నీరు అదనంగా అందుబాటులోకి వచ్చినట్టే. దానివల్ల కనీసం రూ.5 వేల కోట్ల మేర ఆదా అవుతుంది’’ అని చంద్రబాబు వివరించారు.