Home » Nandyal
కన్న బిడ్డలను దారుణంగా చంపేశాడో తండ్రి. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. బిడ్డలను చంపి.. ఆపై ఆయనా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఉండుట్ల గ్రామానికి సమీపంలో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది..
ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో డివైడర్ను దాటిన కారు ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.
శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రార్థనలు, అసాంఘిక కార్యకలాపాలపై దేవస్థానం ఈవో ఆంక్షలు విధించారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమని.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
డిసెంబర్ 20న ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో మహాహారతి కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దంపతులు పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరుతారు. అక్కడ గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.
శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయడంపై యువతి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ తనవే అని... శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.
చాక్లెట్లు తిన్న 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తినటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. కనురెప్పలు నల్లగా మారటం, కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన 14 రకాల సేవలను ఆన్లైన్లో పొంది వీలు కల్పించింది ప్రభుత్వం. ఈ సేవలను 9552300009 నెంబర్కు హాయ్ అని పంపించి సేవలు బుక్ చేసుకోవచ్చిన ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.
రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్మాల్ చేసింది మార్కెటింగ్ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ పక్కనే ఉన్న కొటాక్ మహేంద్ర బ్యాంకు ఉంది.
తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పాణ్యం మండలం కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో (96) మృతిచెందారు.