SriSailam Brahmotsavams: నాలుగో రోజుకు శ్రీశైలం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. పెరిగిన భక్తుల రద్దీ
ABN , Publish Date - Jan 15 , 2026 | 11:28 AM
శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు స్వామి అమ్మవార్లు నంది వాహనంపై ఊరేగనున్నారు.
నంద్యాల జిల్లా, జనవరి 15: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయంలో (Srisailam Temple) మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ (గురువారం) రాత్రి నంది వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చేందుకు ఆది దంపతులు (శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు) సిద్ధమయ్యారు. ఊరేగింపు అనంతరం మకర సంక్రాంతి సందర్భంగా స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జనవరి 12 నుంచి 18 వరకు ఏడు రోజులపాటు పంచాహ్నిక దీక్షతో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ప్రతిరోజూ రుద్ర హోమం, చండీ హోమం వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే ఉత్సవాల సమయంలో కొన్ని అర్చిత సేవలు అంటే రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం మొదలైనవి తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ అధికారులు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News