Share News

Sankranti Wishesh: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు..

ABN , Publish Date - Jan 15 , 2026 | 07:12 AM

భోగి మంటలతో పాత బాధలు దహించిపోతూ, సంక్రాంతి వెలుగులతో కొత్త జీవితం ప్రారంభమై, కనుమ ఆనందాలతో కుటుంబ బంధాలు మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త ఆశలను పండించాలని, చిరునవ్వులను చిందించాలని కోరుకుంటూ మరొక్కసారి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Sankranti Wishesh: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు..
Makar Sankranti wishes to ABN Andhra Jyothy viewers

తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినం వచ్చేసింది. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ప్రకృతి పట్ల కృతజ్ఞతను, రైతు శ్రమకు గౌరవాన్ని తెలియజేస్తుంది. కొత్త పంటలు, కొత్త ఆశలు, కొత్త ఆనందాలతో ప్రతి ఇంటా ఉత్సాహం వెల్లివిరుస్తుంది (Makar Sankranti 2026).


సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఒక అనుభూతి. ఇళ్ల ముందు ముగ్గులు, గాలిపటాలు, పిండివంటల సువాసనలు.. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి పంచుకునే మధుర క్షణాలు. ఏడాదంతా అలసి సొలసిన జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే మరపురాని అనుభూతులు. ఈ పండుగ మీ ఇంట్లో సుఖసంతోషాలు నింపి, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాం (Telugu festival wishes).


ఈ శుభ సందర్భంగా ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు (ABN Andhra Jyothy viewers). భోగి మంటలతో పాత బాధలు దహించిపోతూ, సంక్రాంతి వెలుగులతో కొత్త జీవితం ప్రారంభమై, కనుమ ఆనందాలతో కుటుంబ బంధాలు మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త ఆశలను పండించాలని, చిరునవ్వులను చిందించాలని కోరుకుంటూ మరొక్కసారి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Updated Date - Jan 15 , 2026 | 07:14 AM